26 జిల్లాలుగా మారుతున్న ఆంధ్రప్రదేశ్

0
87

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి కాగా వాటిని 26 జిల్లాలుగా మార్చాలనే నిర్ణయానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగగా 13 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం 25 జిల్లాలుగా మార్చాలని అనుకున్నారు. అయితే అరకు ప్రాంతం సూదురమైన ప్రాంతం కాబట్టి అరకు భాగాన్ని రెండు భాగాలుగా చేసి రెండు జిల్లాలుగా మార్చాలని స్థూలంగా నిర్ణయించారట. దాంతో ఏపీలో 26 జిల్లాలు కానున్నాయి. అయితే ఏ జిల్లాని ఏ రకంగా , ఏ ప్రాతిపదికగా మార్చవచ్చో తెలపాల్సిందిగా ఉన్నత స్థాయి కమిటీ వేశారు జగన్.

ఈ కమిటీ ఏపీ లోని అన్ని జిల్లాలను పరిశీలించి శాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసేలా పలు నిర్ణయాలను వెల్లడించనుంది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి కూడా చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలని ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలని , అవినీతి పరులను కఠినంగా శిక్షించాలని నిర్ణయించారు.  

మునుపటి వ్యాసంకేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం: కరోనా టెస్ట్ ఫ్రీ
తదుపరి ఆర్టికల్మాస్క్ ప్రాధాన్యత చెబుతూ చిరు చేసిన వీడియో వైర
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి