పవన్ కళ్యాణ్ – క్రిష్ ల చిత్రానికి 150 కోట్ల బడ్జెటా ?

0
29
150 crore budget for Pawan Kalyan's Krrish film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏకంగా ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా తాజాగా క్రిష్ దర్శకత్వంలో బందిపోటుగా నటిస్తున్నాడు. మొఘల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతున్న చిత్ర బడ్జెట్ ఏకంగా 150 కోట్లు అని తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న కథనం ప్రకారం 150 కోట్ల బడ్జెట్ అని అంటున్నారు.

సినిమాలో ఎక్కువగా సెట్స్ ఉండటంతో భారీ బడ్జెట్ అవుతోందట. ఎక్కువ సెట్స్ వేయడంతో ఇంత బడ్జెట్ అవుతోందట అయితే ఇంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా ? అన్నది ప్రశ్నగా మారింది. చిత్రంలో పవన్ కళ్యాణ్ గెటప్ అభిమానులను అలరించేలా ఉంది. కోరమీసంతో ఉన్న పవన్ లుక్ ఫ్యాన్స్ ని కేక పెట్టించేలా ఉంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ భామ ప్రగ్యా జైస్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి