RGV నెక్స్ట్ మూవీ పేరు ఏంటి ?ఈసారి టార్గెట్ ఎవరు ?

0
55

మరో బాంబ్ పేల్చిన ఆర్జీవి: ఈసారి టార్గెట్ అల్లు అరవింద్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో బాంబ్ పేల్చాడు. అల్లు అనే టైటిల్ తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అంటే అల్లు అరవింద్ సినిమా అన్నమాట. కేవలం అల్లు అనే టైటిల్ మాత్రమే కాదు కథాంశం ఎలా ఉండబోతోందో అది కూడా స్పష్టం చేశారు ఆర్జీవి. స్టార్ హీరో అయిన తన బావ కోసం బావమరిది ఎలాంటి ప్లాన్ లు అల్లాడు. తన వాళ్లకు మంచి ప్లాన్ ఎలా ఇచ్చాడు. ప్రత్యర్థులను నాశనం చేయడానికి ఎలాంటి ప్లాన్లు అల్లాడు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఈ అల్లు ఎలాంటి పాత్ర పోషించాడు ……. అలాగే ఈ చిత్రంలో  చిరంజీవి , నాగేంద్ర బాబు , పవన్ కళ్యాణ్ , రాంచరణ్, అల్లు అర్జున్, శిరీష్ , పాత్రలు కూడా ఉంటాయని తెలిపాడు వర్మ.

అసలు ఈ సినిమా టైటిల్ ముందుగా బావరాజ్యం అని అనుకున్నాడు. కానీ ఇప్పుడేమో బావ రాజ్యం స్థానంలో అల్లు అనే టైటిల్ ఫిక్స్ చేసాడు. చిరు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో అల్లు అరవింద్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించి అన్ని ముఖ్య వ్యవహారాలు , అలాగే ఆర్ధిక వ్యవహారాలు అన్నీ చూసుకుంది అల్లు అరవింద్. అలాగే అప్పట్లో అల్లు పై సంచలన ఆరోపణలు వచ్చాయి పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని. వర్మ వ్యవహార శైలి చూస్తుంటే అల్లు అరవింద్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్లున్నాడు. కానీ ఇది అల్లు అరవింద్ పై రూపొందుతున్న చిత్రం కాదని తెలివిగా ప్రకటించాడు. మొత్తానికి వివాదాన్ని రేపడం దాన్ని క్యాష్ చేసుకోవడం వర్మకు బాగా అలవాటు అయ్యింది. మరి ఈ అల్లు సినిమాపై అల్లు అరవింద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి