100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్

0
71
prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కోసం ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇంతటి భారీ రెమ్యునరేషన్ అంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం వినేవాళ్లకు. వంద కోట్లు అని మాట్లాడుకోవడం తప్ప ఆ రెమ్యునరేషన్ అందుకున్న హీరోలు ఎవరూ లేరు మొట్టమొదటిసారిగా అంతటి రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో ప్రభాస్ కావడం విశేషం. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. సాహూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అయినప్పటికీ భారీ వసూళ్ళని సాధించింది దాంతో బాక్సాఫీస్ ని షేక్ చేసే సత్తా ప్రభాస్ కుందని అందుకే అంతటి సొమ్ము ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదని తెలుస్తోంది.

దక్షినాదిలో భారీ రెమ్యునరేషన్ అందుకునే హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్ , ఇళయ దళపతి విజయ్ ఉన్నారు. రజనీకాంత్ 80 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఇంచుమించుగా విజయ్ కూడా అదే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అయితే ఇటీవల రజనీకాంత్ కు 100 కోట్ల రెమ్యునరేషన్ అని వినిపిస్తోంది. అయితే అక్కడ 100 కోట్లు అని వినిపించగానే ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్లకు పాకడం విశేషం. ప్రభాస్ తాజాగా రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటించనున్నాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. 

మునుపటి వ్యాసంఈసారి చిరు బర్త్ డే ప్రత్యేకతలు ఏంటో తెలుసా
తదుపరి ఆర్టికల్అర్ధరాత్రి కత్రినా కైఫ్ ఇంటికి వచ్చిన యంగ్ హీరో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి