మహేష్ హ్యాండ్ ఇస్తే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట

0
60

దర్శకుడు వంశీ పైడిపల్లి కి సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాండ్ ఇస్తే మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చరణ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఎవడు అనే సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఎవడు మంచి విజయాన్ని అందుకుంది. దాంతో వంశీ పైడిపల్లి అంటే చరణ్ కు ప్రత్యేకమైన గౌరవం ఉంది. దాంతో వంశీ కథ చెప్పాలి అని అనగానే వెంటనే ఒకే చెప్పాడట. కథ విన్నాక నాకు పక్కాగా సరిపోయే సినిమా అందునా ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇలాంటి సినిమానే చేయాలి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చరణ్. దాంతో పక్కా స్క్రిప్ట్ చేసే పనిలో పడ్డాడట వంశీ పైడిపల్లి.

మహేష్ బాబుతో మహర్షి అనే సూపర్ హిట్ చిత్రం చేసాడు వంశీ పైడిపల్లి. దాంతో ఆ వెంటనే డేట్స్ ఇచ్చాడు వంశీకి. కథ చెప్పాడు బాగానే ఉందని అనుకున్నారు. అయితే ఫుల్ స్క్రిప్ట్ నెరేట్ చేసాక ఆ సినిమాపై నమ్మకం పోయిందట మహేష్ కు దాంతో ఇప్పుడు ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దాంతో షాక్ అయిన వంశీ ఏం చేయాలో తెలీక సతమతం అయ్యాడు. కట్ చేస్తే ఆ షాక్ నుండి తేరుకొని పలువురు హీరోల దగ్గరకు వెళ్ళాడు కానీ ఎవరూ వంశీ పైడిపల్లి కి ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో చరణ్ కోసం ఓ లైన్ అనుకొని చెప్పాడట. అది చరణ్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పక్కా స్క్రిప్ట్ తో రావాలని , తప్పకుండా చేద్దామని అన్నాడట చరణ్ దాంతో ఆ పనిలో పడ్డాడు వంశీ పైడిపల్లి.

 

 

 

మునుపటి వ్యాసంషర్మిల లవ్ స్టొరీ వెనుక కథ ఏంటో తెలుసా
తదుపరి ఆర్టికల్నాగార్జున సవాల్ ని పూర్తి చేసిన సమంత
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి